: అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లు వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో లేనట్టే!: సీపీఎం నేత ఏచూరి


రేపటి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై బిల్లు ప్రవేశపెట్టే అవకాశం లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఢిల్లీలో అఖిలపక్షం సమావేశం ముగిసిన అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజ్యసభలో 10, లోక్ సభలో 8 బిల్లులు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత నియోజకవర్గాల పెంపుపై చర్చిస్తామని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇంకా కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉందని అన్నారు.

ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఆయన మరోమారు ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వడం లేదనే విషయాన్నికేంద్ర మంత్రి వెంకయ్యనాయుడే చెప్పాలని అన్నారు. కాగా, టీడీపీ నేత, కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ, జీఎస్టీ అమలు, ఇబ్బందులపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించినట్టు చెప్పారు. కాగా, వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సంద్భంగా లైబ్రరీ హాల్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది.    

  • Loading...

More Telugu News