: బాహుబలి-3’లో అవకాశమివ్వమన్న నటుడు.. కుదరదన్న నిర్మాత!


న్యూయార్క్ లో నిన్న జరగిన ఐఫా అవార్డుల వేడుకలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ‘డిష్యూం’ చిత్రానికి గాను ఉత్తమ నటుడు (కామిక్)గా వరుణ్ ధావన్ అవార్డు అందుకున్నాడు. ఈ వేడుకకు వ్యాఖ్యాతలుగా ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జొహార్, నటుడు సైఫ్ అలీఖాన్ వ్యవహరించారు. అవార్డు అందుకున్న వరుణ్ ధావన్ కు ఈ సందర్భంగా వారు శుభాకాంక్షలు చెప్పారు.

ఈ నేపథ్యంలో వరుణ్ ధావన్  మాట్లాడుతూ, కేవలం హాస్యం పండించే పాత్రలే కాకుండా, ఇంకా వెరైటీ పాత్రలు చేయాలని ఉందని, ముఖ్యంగా సీరియస్ పాత్రల్లో నటించాలని ఉందని అన్నాడు. ‘కరణ్ నువ్వు ‘బాహుబలి 3’ తీస్తే నాకు అవకాశమిస్తావా? అని వరుణ్ అడగగా, ‘కుదరదు’ అని కరణ్ రిప్లై ఇచ్చాడు. ఈ మాటలకు  ఆశ్చర్యపోయిన వరుణ్.. ‘ఎందుకు?’ అని ప్రశ్నించగా, ‘దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం’ అని కరణ్ తిరిగి స్పందించాడు. 

  • Loading...

More Telugu News