: ఆ మగబిడ్డ బరువు 5.5 కిలోలు!
శ్రీకాకుళం జిల్లాలో 5.5 కిలోల బరువు ఉన్న ఓ బాలభీముడు జన్మించాడు. ఇచ్ఛాపురానికి చెందిన చిన్నాకుల వీధికి చెందిన జ్యోత్స్నకు నిన్న పండంటి మగబిడ్డ పుట్టాడు. స్థానిక నర్సింగ్ హోమ్ లో ఆమెకు నిన్న డెలివరీ అయింది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ, అప్పుడే పుట్టిన బిడ్డ ఎవరైనా రెండున్నర కిలోల నుంచి మూడున్నర కిలోలు ఉంటారని చెప్పారు. అందుకు భిన్నంగా, ఈ మగశిశువు ఇంత బరువు ఉండటంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.