: లోయలో పడ్డ బస్సు.. 10 మంది అమర్ నాథ్ యాత్రికుల దుర్మరణం!


అమర్ నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. అనంత్ నాగ్ జిల్లాలోని  పహెల్గాంలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడి10 మంది దుర్మరణం చెందగా, 35 మందికి గాయాలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, జమ్మూకాశ్మీర్ లో అమర్ నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై కొన్ని రోజుల క్రితం ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంఘటన తెలిసిందే. ఈ దాడిలో 8 మంది ప్రయాణికులు మృతి చెందారు.  

  • Loading...

More Telugu News