: ఈ దందాను ఏం చేద్దాం సార్?...: అందరి పేర్లతో నివేదిక తీసుకెళ్లి కేసీఆర్ ను కలిసిన అకున్ సబర్వాల్
ఈ ఉదయం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ టాలీవుడ్ డ్రగ్స్ దందాపై సమీక్ష నిర్వహించగా, తమ విచారణలో వెల్లడైన సమస్త సమాచారాన్నీ అకున్ సబర్వాల్ సీఎం ముందుంచారు. ఇప్పటివరకూ అరెస్ట్ చేసిన వారి నుంచి సేకరించిన సమాచారాన్ని, తమ వద్ద ఉన్న సినీ ప్రముఖుల పేర్లను ఆయన కేసీఆర్ కు వివరించినట్టు తెలుస్తోంది. ఈ కేసు విచారణపై నివేదికను సమర్పించిన ఆయన, తదుపరి ఏం చేయాలన్న విషయమై కేసీఆర్ సలహాను అడిగినట్టు సమాచారం. కేసులో రాజకీయ ఒత్తిళ్లు వస్తే లొంగవద్దని, మీ పని మీరు చేసుకుంటూ వెళ్లాలని, అవసరం అనుకుంటే పోలీసుల సాయం తీసుకోవాలని కేసీఆర్ స్పష్టంగా చెప్పారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశానికి డీజీపీ అనురాగ్ శర్మ కూడా హాజరయ్యారు.