: అనిల్ కుంబ్లే జీతమే రవిశాస్త్రికి కూడా!


భారత క్రికెట్ జట్టుకు కోచింగ్ ఇచ్చేందుకు గాను ఏడాదికి రూ. 7 కోట్ల నుంచి రూ. 7.5 కోట్ల వరకూ రవిశాస్త్రికి వేతనంగా ఇవ్వనున్నట్టు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. గత సంవత్సరం అనిల్ కుంబ్లేను ఇంటర్వ్యూ చేసిన వేళ, ఆయన ఏడాదికి రూ. 7 కోట్లను కోరారని, ఆ మొత్తాన్ని ఆయనకు ఇచ్చామని, ఇప్పుడూ అంతే మొత్తాన్ని రవిశాస్త్రికి కూడా ఆఫర్ చేయనున్నామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. నిబంధనల ప్రకారం హెడ్ కోచ్ కి రూ. 7.5 కోట్ల కన్నా అధిక వేతనం ఇవ్వరాదని గుర్తు చేసిన ఆయన, అనిల్ కుంబ్లేకు ఇచ్చినంతే రవిశాస్త్రికీ ఇవ్వనున్నట్టు తెలిపారు.

ఇక ఆయనకు సపోర్టింగ్ స్టాఫ్ గా ఉండే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లకు ఏడాదికి రూ. 2 కోట్ల చొప్పున వేతనం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కాంట్రాక్టులన్నీ సాధ్యమైనంత త్వరగా ఫైనలైజ్ చేస్తామని అన్నారు. గత సంవత్సరం ఉన్న కోచ్ లు ఎవరైనా ఈ ఏడు కూడా కొనసాగితే, వేతనంలో పెంపుదల ఉంటుందని అన్నారు. కాగా, రెండేళ్ల నుంచి ఇండియా ఏ, అండర్ 19 టీములకు కోచ్ గా ఉన్న ద్రావిడ్ కు తొలి సంవత్సరంలో 4.5 కోట్లు, రెండో సంవత్సరంలో రూ. 5 కోట్లు వేతనంగా లభించిందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News