: టాలీవుడ్ టాప్-5 హీరోల్లో ఇద్దరు నా కస్టమర్లు... పోలీసుల విచారణలో కెల్విన్!


టాలీవుడ్ లోని టాప్-5 హీరోల్లో ఇద్దరు తన కస్టమర్లేనని డ్రగ్స్ దందాలో సిట్ పోలీసులు అరెస్ట్ చేసిన కెల్విన్ తాజాగా వెల్లడించినట్టు తెలుస్తోంది. అతని నుంచి మూడు సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకోగా, 2,100కు పైగా కాంటాక్టులు లభించాయి. వాటిల్లో 100కు పైగా కాంటాక్టులు సినిమా వర్గాలకు చెందిన వారివేనని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. తెలుగు పరిశ్రమలో ప్రస్తుతం టాప్-5లో ఉన్న వారిలో ఇద్దరి నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకూ ఎంతో మందికి తాను డ్రగ్స్ అందించినట్టు కెల్విన్ వెల్లడించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఇక తెలుగులో టాప్-5 స్థానాలు హీరోలు నటిస్తున్న చిత్రాల జయాపజయాలను బట్టి మారుతుండటం తెలిసిందే. దీంతో వారు ఎవరన్న లీక్ లను కూడా పసిగట్టలేకపోతున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణలను పక్కనబెడితే, టాలీవుడ్ లో మహేష్ బాబు, రాం చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ, రానా తదితరులు ఎందరో టాప్ స్థానాల్లో పోటీ పడుతున్నారు. వీరు తామిస్తున్న హిట్లను బట్టి టాప్-5 నుంచి అటూ ఇటూ మారుతున్నవారే. ఇక ఈ జాబితాలో రవితేజ పేరు ఇప్పటికే డ్రగ్స్ దందాలో వెలుగులోకి వచ్చింది. ఇంకో హీరో ఎవరన్న విషయమై ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

  • Loading...

More Telugu News