: నేటి నుంచి రైల్వేల్లోకి కొత్తగా వచ్చి చేరిన ఫోర్త్ టైర్ ఏసీ బోగీ
రైళ్లలో ఉండే ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, చెయిర్ కార్ లకు తోడుగా ఫోర్త్ టైర్ ఏసీ బోగీలు నేటి నుంచి జత అయ్యాయి. స్లీపర్ కన్నా ఎక్కువ ధరతో, థర్డ్ ఏసీ కన్నా తక్కువ ధరతో ఉండే ఈ బోగీలోని సీట్ల రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఈ బోగీల్లో 24 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంటారు. ఈ బోగీలో ప్రత్యేకించి దుప్పట్లు, దిండ్లు ఇవ్వరన్న సంగతి తెలిసిందే. అవసరమని కోరిన వారికి మాత్రమే వీటిని అందిస్తారు. పలు రైళ్లకు ఈ కోచ్ లను జోడించామని, వీటికి సంబంధించిన రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.