: గెలిపిస్తే అర్ధరాత్రి విహారానికి అనుమతిస్తాం
కర్ణాటకలో అధికార బీజేపీ ఈసారి బెంగళూరు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆకట్టుకునే హామీని యువ ఓటర్ల ముందు ఆవిష్కరించింది. తమకు ఓటేసి మరోసారి అధికారంలోకి రావడానికి సహకరిస్తే.. బెంగళూరులో నైట్ లైఫ్ కు అనుమతిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ 11.30 వరకూ బార్లు, రెస్టారెంట్లు తెరచి ఉంచడానికి అనుమతి ఉంది. ఈ సమయం పొడిగించాలని యువతీ, యువకుల నుంచి డిమాండ్లు ఉన్నాయి. అయినా, ఇన్నాళ్లూ పట్టించుకోని బీజేపీ కీలక సమయంలో దానినే ఆయుధంగా వదిలింది. ఓటేసి గెలిపిస్తే.. అర్ధరాత్రి వరకూ బార్లు, రెస్టారెంట్లు తెరచి ఉంచడానికి అనుమతిస్తామని హామీ ఇచ్చింది. బెంగళూరులో 45లక్షలకు పైగా ఐటి ఉద్యోగులున్నారు. అందుకే బీజేపీ ఈ హామీని ఓటర్లపై సమ్మోహనాస్త్రంగా వదలింది.