: కమలహాసన్ సారీ చెప్పాల్సిందే: జాతీయ మహిళా కమిషన్
సినీనటుడు కమలహాసన్‌పై జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్యూ) మరోసారి మండిపడింది. లైంగిక వేధింపులకు గురైన మలయాళ నటి పేరును కమలహాసన్ నిబంధనలకు విరుద్ధంగా మీడియా ముందు పలికారని ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న ఎన్సీడబ్యూ ఛైర్‌పర్సన్ లలితా కుమారమంగళం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... కమలహాసన్ తాను చేసిన వ్యాఖ్యలపట్ల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి కమల్‌కు తాము ఇప్పటికే లేఖ పంపించామని తెలిపారు. అలాగే కమల్ చేసిన వ్యాఖ్యలను తిరిగి వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు.