: తన వాళ్లనే కోచ్ లుగా నియమించాలని పట్టుబడుతున్న రవిశాస్త్రి!
టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎన్నికైన రవిశాస్త్రి.. బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్ పనికిరాడని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. టీమిండియాకు సబ్ కోచ్‌లుగా తనకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకోవడం గురించి చర్చించేందుకు రవిశాస్త్రి ఎల్లుండి ఓ భేటీలో పాల్గొననున్నారు. సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీతో ఆయన సమావేశమై ఈ అంశంపైనే చర్చించనున్నారు. టీమిండియాకు బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్‌ను నియమించాలని రవిశాస్త్రి కోరే అవకాశం ఉంది. ప్రస్తుతం టీమిండియాకు సంజయ్ బంగర్ బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతుండగా, ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్.శ్రీధర్ ఉన్నారు.