: రేప్ వ్యాఖ్యలు చేసినందుకు రూపా గంగూలీపై కేసు నమోదు
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ హయాంలో శాంతి భద్రతలు అధ్వానంగా వున్నాయని విమర్శిస్తూ బీజేపీ నేత రూపా గంగూలీ చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆమెపై కేసు పెట్టారు. `మీ భార్యలను, కూతుళ్లను 15 రోజులు బెంగాల్‌కు పంపండి. వాళ్లు రేప్‌కు గురి కాకపోతే చూడండి` అంటూ రూపా చేసిన వ్యాఖ్యలు బెంగాల్‌లో కలకలం సృష్టించాయి. `మా రాష్ట్ర రక్షణ గురించి మాట్లాడేముందు, బెంగాల్‌లో ఆమె ఎన్నిసార్లు రేప్‌కు గురయ్యారో వివరించాలి. అప్పుడే ఆమె మాట్లాడే మాటలు నమ్మశక్యంగా ఉంటాయి` అని మంత్రి శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ ఆమె మాటలకు ఘాటుగా సమాధానమిచ్చారు.
గతనెల బెంగాల్ ఏజెన్సీ ప్రాంతంలో ముగ్గురు గిరిజన మహిళలపై జరిగిన గ్యాంగ్‌రేప్‌ను ఉద్దేశించి రూపా గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశారు. నిందితులకు తృణమూల్ నేతలే అండగా నిలుస్తున్నారని బెంగాల్‌లో మహిళలకు రక్షణ లేదని ఆమె వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే!