: పోలవరం పూర్తి చేసి రాష్ట్రంలో కరవు లేకుండా చేయడమే లక్ష్యం: చంద్రబాబు
ఈ రోజు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కేఎల్ రావు జయంతి వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేఎల్ రావు సమాజానికి చేసిన సేవలను గుర్తు చేశారు. తమ ప్రభుత్వం పోలవరాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతుందని చెప్పారు. పోలవరం పూర్తి చేసి రాష్ట్రంలో కరవు లేకుండా చేయడమే తమ లక్ష్యమని అన్నారు. నదుల్లోని నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అందుకు నదుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్ని సమస్యలు వచ్చినా తాము అనుకున్నది చేసి తీరుతామని చెప్పారు.