: ఎవ్వరినీ వదలొద్దు.. అందరి పేర్లూ బయటపెట్టండి!: డ్రగ్స్ కేసులో అకున్ సబర్వాల్‌కు స్పష్టతనిచ్చిన కేసీఆర్
మత్తు పదార్థాల కేసుతో సంబంధమున్నవారు ఎంతటి ప్రముఖులైనా, వారిని వదిలిపెట్టొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌కు తేల్చి చెప్పారు. అకున్ సబర్వాల్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన ఈ కేసులో ఉన్నవాళ్లందరి పేర్లను బయటపెట్టాలని, వారు ప్రముఖులైనా వెనకడుగు వేయొద్దని, తప్పు చేసిన వారికి తమ ప్రభుత్వం మద్దతు పలకదని అన్నారు.
కేసు విచారణ కోసం సెలవులు రద్దు చేసుకోవాలని, లేకపోతే ప్రభుత్వానికి, పోలీసు శాఖకి చెడ్డపేరు వస్తుందని ఆయన చెప్పారు. కేసీఆర్ ఆదేశానుసారం అకున్ సబర్వాల్ సెలవులు రద్దు చేసుకొని, డ్రగ్స్ కేసుతో సంబంధమున్న వారిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 14 మందిని అరెస్టు చేశారు.