: వైద్యాధికారిణిపై వైసీపీ కార్పొరేటర్ దౌర్జన్యం.. గదిలో నిర్బంధించిన వైనం
రాజమహేంద్ర వరంలోని రాజేంద్ర నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఆర్ఎంపీ వైద్యుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ జంపా శ్రీహరి చేయిచేసుకున్నారు. అంతేగాక, వైద్యాధికారిణి విజయకుమారిని ఆయన ఓ గదిలో నిర్బంధించారు. ఈ రోజు తమ ప్రాంతంలో నిర్వహించిన వైద్య శిబిరంలో స్థానికులకు సరిపడా ఔషధాల సరఫరా జరగలేదని ఆయన మండిపడ్డారు. వైద్యులతో వాగ్వివాదానికి దిగి ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వెంటనే అక్కడకు చేరుకుని వైద్యాధికారిణిని విడిపించారు.