: విషవాయువుల వల్ల ఊపిరాడక నలుగురు పారిశుద్ధ్య కార్మికుల మృతి
దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది. విషవాయువుల వల్ల ఊపిరాడక నలుగురు పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని జితోర్ని ప్రాంతంలో ఈ నలుగురు పారిశుద్ధ్య కార్మికులు ఈ రోజు తమ పనులు నిర్వర్తించడానికి వెళ్లారు. ఆ ప్రాంతంలోని ఓ సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువుల వల్ల వారికి ఊపిరాడకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
సెప్టిక్ ట్యాంకు నుంచి వారు ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడకు చేరుకున్న అధికారులు, పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించగా వారంతా అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. సదరు కార్మికులను స్వర్ణ్ సింగ్ (45), దీపు (28), అనిల్ (23), బల్విందర్ (32) గా పోలీసులు గుర్తించారు.