: విశాఖపట్నంలో ఆక్రమణకు గురైన భూముల కేసులో సర్కారు తాజా ఉత్తర్వులు
విశాఖపట్నంలో ఆక్రమణకు గురైన భూముల కేసులో ఆంధ్రప్రదేశ్ సర్కారు తాజాగా పలు ఉత్తర్వులు జారీ చేస్తూ సిట్ పరిధిని పెంచింది. తాజా ఆదేశాల ప్రకారం ఈ భూముల వ్యవహారంలో మాజీ సైనికులు, పొలిటికల్ సఫరర్స్‌కు ఇచ్చిన నిరభ్యంతర పత్రాలపైనా విచారణకు ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేటు భూములకు సంబంధించిన భూముల ఆక్రమణలన్నింటినీ పరిశీలించాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. భూములకు సంబంధిత పత్రాల్లో ఏమైనా మార్పులు చేశారా? అనే అంశంపైనా విచారణ చేపట్టాలని చెప్పింది. అలాగే వెబ్‌ల్యాండ్, రెవెన్యూ రికార్డుల్లోని అన్ని అంశాలపైనా విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.