: డ్రగ్స్ కేసులో మరో వ్యక్తి అరెస్ట్!
కలకలం రేపుతోన్న డ్రగ్స్ కేసులో సంబంధిత అధికారులు వేగంగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నిన్న తెలిపిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంబంధం ఉన్న మరో వ్యక్తిని ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఏజీ కాలనీకి చెందిన ఓ వ్యక్తిని ఈ రోజు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అరెస్టు అయిన వారి సంఖ్య 14కి చేరిందని తెలిపారు. విద్యాలయాలు, సినీ పరిశ్రమలోని ప్రముఖులకు, పబ్బులకు సదరు నిందితులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.