: అయ్యన్న పాత్రుడికి చేదు అనుభవం.. మంత్రిని అని చెప్పినా పట్టించుకోని పోలీసులు!
ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు చేదు అనుభవం ఎదురైంది. అమరావతిలో ఈరోజు ఎస్ఆర్ఎం యూనివర్శిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అయ్యన్నపాత్రుడు కొంచెం ఆలస్యంగా వచ్చారు. సభా వేదికపైకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించగా... పోలీసులు ఆయనను ఆపేశారు. మూసి ఉంచిన బారికేడ్లను తొలగించేందుకు ససేమిరా అన్నారు. తాను మంత్రిని అని చెప్పుకున్నా వారు వినలేదు. జిల్లా ఎస్పీ ఆదేశిస్తేనే బారికేడ్లు తీస్తామని వారు తేల్చి చెప్పారు. దీంతో, అయ్యన్న అసహనానికి గురై, అక్కడ నుంచి వెళ్లిపోయారు.