: తన చిన్నారి అభిమాని మృతిపట్ల హీరో రామ్ చరణ్ దిగ్భ్రాంతి
మెగా హీరో రామ్ చరణ్ తేజ్ చిన్నారి అభిమాని పరశురామ్ నిన్న కామెర్ల వ్యాధితో బాధపడుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ బాలుడు రెండేళ్ల క్రితం రామ్ చరణ్ ని కలిసి కొద్దిసేపు ముచ్చటించాడు. ఆ బాలుడు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న రామ్ చరణ్‌తేజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఆ చిన్నారి తనను గతంలో కలిసినప్పటి ఓ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి, ఈ వార్త తెలుసుకుని షాక్‌కు గురయ్యానని అన్నాడు. ఆ బాలుడి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చెబుతూ, 'ఆర్ఐపీ బ్రదర్' అని పేర్కొన్నాడు.