: డ్రగ్స్ ను వాడి సినీ పరిశ్రమ పరువు తీయకూడదు: మురళీ మోహన్
డ్రగ్స్ తీసుకోవడం అనేది మంచిది కాదని సీనియర్ సినీనటుడు, ఎంపీ మురళీ మోహన్ అన్నారు. టాలీవుడ్‌లో సంచలనం రేపుతోన్న డ్రగ్స్ వ్యవహారంలో ఈ రోజు ఆయన స్పందించారు. టాలీవుడ్‌లో డ్రగ్స్‌కు అలవాటుపడిన ప్రముఖుల పేర్లు తనకు తెలియవని చెప్పారు. ఈ కేసు విచారణలో ఎవ్వరూ ఒత్తిడి తీసుకురాలేరని అన్నారు. మన సమాజంలో పబ్ కల్చర్ వచ్చాకే డ్రగ్స్ వాడకం పెరిగిందని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ ను వాడి సినీ పరిశ్రమ పరువు తీయకూడదని సూచించారు. సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారాన్ని ఘోరమైన చర్యగా ఆయన అభివర్ణించారు.