: 'డ్రగ్స్'పై సోషల్ మీడియాలో తనపై జరుగున్న ప్రచారంపై స్పందించిన పూరీ జగన్నాథ్!


డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురి పేర్లు బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పలు రకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా పూరీ జగన్నాథ్ చెప్పినట్టు ఏకంగా ఓ స్టోరీనే సర్క్యులేట్ అవుతోంది. డ్రగ్స్ వాడుతోంది తానే కాదు... వీరు కూడా వాడుతున్నారంటూ కొందరు యంగ్ హీరోల పేర్లను పూరీ చెప్పినట్టు ఓ వెబ్ సైట్ కూడా ప్రచురించింది. ఈ నేపథ్యంలో, ఈ వార్తలకు పూరీ జగన్నాథ్ ఫుల్ స్టాప్ పెట్టాడు. తాను ఈ వ్యవహారానికి సంబంధించి ఇంతవరకు ఎవరికీ ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. బాలయ్యతో తాను నిర్మిస్తున్న 'పైసా వసూల్' సినిమాను పూర్తి చేసే పనిలో తాను చాలా బిజీగా ఉన్నానని తెలిపాడు.

  • Loading...

More Telugu News