: నాయకుడొచ్చాడు... సీఎస్కేకు ఘనస్వాగతం పలికిన ధోనీ
రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ అభిమానుల ముందుకు వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి దాని మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని తనదైన శైలిలో స్వాగతం పలికాడు. తన ఇంటి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ ధరించి ఉన్న ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ జెర్సీ మీద తన పేరుకి బదులుగా `తళ` అని ఉంది. `తళ` అంటే తమిళంలో `నాయకుడు` అని అర్థం. అంటే సీఎస్కే జట్టుకు మళ్లీ ధోనీ నాయకత్వం వహించనున్నాడా? అంటూ నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఎస్కే ఫ్రాంచైజీ ప్రతినిధి జాన్ ధోనీని ఎలాగైనా మళ్లీ జట్టులోకి తీసుకొస్తాం అని ప్రకటించారు. ఇందుకు ధోనీ కూడా సుముఖంగానే ఉన్నట్టు ఈ ఫొటో ద్వారా అర్థమవుతోంది.