: పుట్టిన రోజు నాటి నుంచి పవన్ రథయాత్ర?
2019 ఎన్నికల్లో పవన్ జనసేన పార్టీ పోటీ చేయనున్నట్టు ఇంతకు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే! అయితే ప్రచారాన్ని కూడా ఇప్పట్నుంచే మొదలు పెట్టే యోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. తన పుట్టినరోజైన సెప్టెంబర్ 2న అనంతపురం నుంచి రథయాత్రను ప్రారంభించనున్నట్టు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజల వద్దకు ప్రత్యక్షంగా వెళ్లి వారి సమస్యల గురించి తెలుసుకుంటానని జనసేన సభల్లో పవన్ చాలాసార్లు చెప్పారు.
ఇందులో భాగంగానే ఈ రథయాత్ర ప్లాన్ చేసినట్టు పవన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రథయాత్ర సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమస్యపైనే పవన్ ఎక్కువగా దృష్టిసారించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ పాదయాత్ర అక్టోబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో అందరికంటే ముందు ఎన్నికల ప్రచారాన్ని జనసేన పార్టీయే ప్రారంభించినట్లవుతుంది.