: టీఆర్ఎస్ ఖాతాలో మరో రెండు ఎంపీటీసీ స్థానాలు
అధికార పార్టీ టీఆర్ఎస్ ఖాతాలో మరో రెండు ఎంపీటీసీ స్థానాలు చేరాయి. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడెం మండలం శివన్నగూడెం ఎంపీటీసీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. 502 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి దాసరి మమతపై టీఆర్ఎస్ అభ్యర్థి మాదగోని ముత్తమ్మ గెలిచారు. అలాగే జోగులాంబ గద్వాల్ జిల్లా కాలూర్ తిమ్మన్ దొడ్డి (కేటీ దొడ్డి) ఎంపీటీసీ స్థానం కూడా టీఆర్ఎస్ కైవసమైంది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి మణెమ్మ, కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలపై 160 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.