: 'కట్టప్ప' కుమార్తెను చంపుతామంటూ బెదిరింపులు.. మోదీకి లేఖ!


'బాహుబలి' సినిమాలలో కట్టప్ప పాత్రను పోషించిన సీనియర్ నటుడు సత్యరాజ్ అంతులేని క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన కుమార్తె దివ్యకు కొందరు దుండగుల నుంచి బెదిరింపులు వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే, సత్యరాజ్ కుమార్తె దివ్య వైద్యురాలిగా పని చేస్తున్నారు. నిషేధిత మందులను ప్రిస్క్రైబ్ చేయమంటూ ఆమెపై కొందరు ఒత్తిడి తెచ్చారు. అంతేకాదు, ఆమెకు లంచం ఇవ్వడానికి కూడా ప్రయత్నించారు. ఆమె వినకపోవడంతో... బెదిరింపులకు దిగారు. చంపేస్తామంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, ఆమె నిన్న ఏకంగా ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తూ, ఓ లేఖ రాశారు.

తన కుమార్తె ప్రధానికి లేఖ రాసినట్టు సత్యరాజ్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేని, అపాయకరమైన మందులను పూర్తిగా నిషేధించాలని తన ప్రకటనలో ఆయన కోరారు. అంతేకాదు, నీట్ ప్రవేశ పరీక్ష వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి, వైద్య రంగంలో నెలకొన్న అశ్రద్ధ గురించి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  

  • Loading...

More Telugu News