: తలనీలాలు ఇచ్చి, దాతృత్వాన్ని చాటుకున్న వరుణ్ సందేశ్ భార్య వితికా!
నిద్రపట్టక మాత్రలు వేసుకుంటే ఆత్మహత్యాయత్నంగా చిత్రీకరించి నానా హంగామా సృష్టించారని ఇటీవల మీడియాకు స్పష్టం చేసిన వరుణ్ సందేశ్ భార్య వితికా శేరు, ఈ సారి ఒక మంచి పని చేసి ఆత్మహత్యాయత్నం వదంతుల నుంచి అందరి దృష్టిని మార్చే ప్రయత్నం చేసింది. కేన్సర్ పేషెంట్లకు తలనీలాలు దానం చేసి తన దాతృత్వాన్ని చాటుకుంది. ఈ విషయానికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఓ మెసేజ్ కూడా ఇచ్చింది.
`డబ్బు, అన్నం దానం చేయడం కంటే ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టును దానం చేయడం కొంచెం కష్టమైన పని. అయినా ఇవ్వడంలో ఉండే ఆనందం ఎందులోనూ ఉండదు, అందుకే తలనీలాలు ఇచ్చేస్తున్నాను` అంటూ ఆమె పోస్ట్ చేసింది. చెన్నైలోని `కేన్సర్ ఇనిస్టిట్యూట్ ఆద్యార్`కు ఆమె జుట్టు దానం చేసింది.