: ఇస్లామిక్ స్టేట్‌కు మరో ఎదురుదెబ్బ.. అబు సయ్యద్ హతం.. తమకు దక్కిన మరో విజయమన్న అమెరికా!
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ హతమయ్యాడని ఐస్ ప్రకటించి రెండు రోజులైనా గడవకముందే ఆ సంస్థకు చెందిన మరో నేత హతమయ్యాడు. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఐసిస్-ఖొరాసన్ (ఐసిస్-కె) నేత అయిన అబు సయ్యద్‌ను అమెరికా దళాలు హతమార్చినట్టు అమెరికా ప్రభుత్వం తెలిపింది. ఈనెల 11న ఆఫ్ఘనిస్థాన్‌లోని కునార్ ప్రావిన్స్‌లో అమెరికా దళాలు జరిపిన దాడిలో అబు సయ్యద్ మరణించినట్టు పెంటగాన్ అధికార ప్రతినిధి దానా వైట్ తెలిపారు. అబు సయ్యద్ మరణంపై రక్షణ కార్యదర్శి జేమ్స్ మాటిస్ మాట్లాడుతూ ఐస్‌పై తాము సాధించిన మరో విజయం ఇదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఐసిస్-కె కు చెందిన ముగ్గురు ఉగ్ర నేతలు హతమవగా అబు మూడో వాడు. ఆఫ్ఘనిస్థాన్‌లో ఐఎస్‌కు చోటు లేకుండా చేస్తామని ఆఫ్ఘనిస్థాన్‌లోని అమెరికా దళాల కమాండర్ జనరల్ జాన్ నికోల్సన్ తెలిపారు.