: ప్రియుడితో వెళ్లిపోయిన మైనర్ బాలిక... గర్భంతో తిరిగొచ్చిన వైనం.. యువకుడి అరెస్ట్!


రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన 13 ఏళ్ల బాలిక మూడు వారాల గర్భంతో తిరిగి ఇంటికి చేరుకోవడం ఢిల్లీలో కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 22 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఏడాది మే 10న ఐస్ క్రీములు కొనేందుకని బయటకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఓ హోటల్‌లో ‘కుక్’గా పనిచేస్తున్న ఇద్దు ఖాన్‌పై బాలిక తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.

కోర్టులో హాజరు పరిచిన అనంతరం అతనిని జైలుకు తరలించారు. అయితే బాలికను తాను పెళ్లి చేసుకున్నట్టు యువకుడు తెలిపాడు. దీంతో అతడిపై బాలిక వివాహ చట్టం కింద మరో కేసు నమోదు చేశారు. అతడి వివాహానికి సాక్షులుగా వ్యవహరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలిక మాత్రం ఇద్దు ఖాన్‌తోనే ఉంటానని కోర్టులో స్పష్టం చేసింది. తనను తల్లిదండ్రుల వద్దకు పంపించవద్దని అభ్యర్థించింది. ప్రస్తుతం ఆమె చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణలో ఉంది.

బాలిక ఢిల్లీలోని తైమూర్ నగర్‌లో తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులతో కలిసి ఓ చిన్న గదిలో జీవిస్తోంది. ఆ పక్కనే ఖాన్ స్నేహితులతో కలిసి నివసిస్తున్నాడు. మే 10న బాలిక అదృశ్యమైన తర్వాత ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. జూలై 3న ఖాన్ స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నిందితుడు సాకేత్ కోర్టులో బాలికతో సహా లొంగిపోయాడు.

  • Loading...

More Telugu News