: నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లకు ఫోన్ చేసి.. విడిపోవద్దని చెప్పిన సోనియా
ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఇటీవల సీబీఐ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆర్జేడీతో విడిపోతారని వార్తలు వచ్చాయి. అయితే, నితీశ్ మాత్రం లాలూతో విడిపోయే సమస్యేలేదని చెప్పారు. తాజాగా ఆ ఇరువురు నేతలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోన్ చేసి మాట్లాడారు. విడిపోకూడదని ఇరువురు నేతలకు సూచించారు. దీంతో నితీశ్, లాలూ కొన్ని రోజుల్లో అన్ని సమస్యలూ తొలగిపోతాయని సోనియాతో చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి హరేంద్ర కుమార్ చెప్పారు.