: ‘పాక్’ ప్రతిపక్షనేత ఇమ్రాన్ ఖాన్ ఆస్తుల సీజ్ కు కోర్టు ఆదేశం!


పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్, ప్రతిపక్షనేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఆస్తులను సీజ్ చేయాల్సిందిగా ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ఈ రోజు ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్ తో పాటు, రాజకీయ నాయకుడిగా మారిన మతపెద్ద తహీరుల్ ఖాద్రీ ఆస్తులను సీజ్ చేయాల్సిందిగా ఆదేశించింది. కాగా, 2014లో ఇస్లామాబాద్ లో నిర్వహించిన ఆందోళనలో హింసకు ఇమ్రాన్, ఖాద్రీ కారణమంటూ నాడు పోలీస్ కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసు విచారణకు ఇమ్రాన్, ఖాద్రీలు హాజరు కాలేదు. దీంతో, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగిణించిన కోర్టు వారి ఆస్తులు సీజ్ చేస్తున్నట్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News