: జగన్ పాదయాత్ర మొదలుపెడితే ప్రతి శుక్రవారం విరామం తప్పదు: మంత్రి గంటా


వైసీీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీ అధినేత చంద్రబాబుకు.. సోమవారం పోలవారం అయితే, జగన్ కు.. శుక్రవారం కోర్టువారం అని సెటైర్ వేశారు. జగన్ తన పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ప్రతి శుక్రవారం విరామం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఎందుకంటే, అక్రమ కేసుల విచారణ విషయమై ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది కదా? అన్నారు.

కాగా, టీడీపీకి చెందిన మరో నేత బండారు సత్యనారాయణ మాట్లాడుతూ, పదహారు నెలల జైలు జీవితం గడిపిన జగన్ ఎలా నవ్వుతున్నాడో అర్థం కావడం లేదని అన్నారు. జగన్ మనిషా? మానవమృగమా? అని ప్రశ్నించారు. అయితే, జగన్ సోదరి షర్మిల గురించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. ఎందుకంటే, షర్మిల తనకు చెల్లెలితో సమానమని, ఆమె గురించి తానేమీ మాట్లాడనని.. అంతగా కావాలంటే, యూట్యూబ్ లో వెతికితే ఆమె గురించిన సమాచారం దొరుకుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News