: అంతర్జాతీయ సమాజం ముందు మరోసారి తన తీరును బయటపెట్టుకున్న చైనా


చైనాలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం అలుపెరుగ‌ని పోరాటం చేసిన ధీశాలి, నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్రహీత‌ లీయు జియాబో అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ నిన్న ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచిన విష‌యం తెలిసిందే. త‌న‌ను ఎన్నో ఏళ్లు జైలులోనే ఉంచి, పెరోల్ పై విడుద‌ల చేసిన కొన్ని రోజుల‌కే ఆయ‌న చ‌నిపోయారు. ఆయ‌న క‌న్నుమూసిన త‌రువాత కూడా చైనా ప‌లు వ్యాఖ్య‌లు చేసి త‌మ తీరును బ‌య‌ట‌పెట్టుకుంది. తమ దేశ పౌరుడికి ఇచ్చిన నోబెల్ పుర‌స్కారాన్ని తప్పుబట్టింది. లీయు జియాబోకి వంటి వ్య‌క్తికి అవార్డు ఇవ్వడం అంటే దైవ దూషణ చేసినట్లేనంటూ వ్యాఖ్య‌లు చేసింది. పలు దేశాలు ఎంతగా మొత్తుకున్నా ఆయ‌న‌ను చికిత్స కోసం విదేశాల‌కు పంపించని చైనా తీరును అంత‌ర్జాతీయ స‌మాజం త‌ప్పుబ‌డుతున్న నేప‌థ్యంలో, ఆ దేశం ఇటువంటి వ్యాఖ్య చేస్తూ ప్ర‌క‌ట‌న చేయడం అందర్నీ మరింత ఆశ్చర్యానికి గురిచేసింది.

  • Loading...

More Telugu News