: ధోనీతో కలిసి బైక్ రైడింగ్ కాదు, గుర్రపుస్వారీ చేయాలని ఉంది: రవీంద్ర జడేజా
ధోనీతో కలిసి గుర్రపుస్వారీ చేయాలన్నది తన కోరిక అని టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు. ఓ స్పోర్ట్స్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ధోనీ సలహా మేరకు తాను ఓ బైక్ కొన్నానని, అయితే, దాన్ని నడపాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు. ధోనీని కలిసినప్పుడు ఈ విషయమై దాన్ని ఎలా నడపాలని అడిగితే కొన్ని చిట్కాలు చెప్పాడని అన్నాడు. అయితే, తనకు కూతురు పుట్టడంతో ఇప్పుడు బైక్ నడిపే సమయం తనకు లేదని చెప్పిన జడేజా, ధోనీతో కలిసి బైక్ రైడింగ్ కాదు గానీ.. గుర్రపుస్వారీ చేయాలన్నది తన కోరికని చెప్పాడు.