: విశాఖ జిల్లాలో 'హెరిటేజ్' వేడుకలు.. నారా బ్రాహ్మణి హాజరు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు, మంత్రి లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఈ రోజు విశాఖ జిల్లా బయ్యవరంకు వచ్చారు. హెరిటేజ్ సంస్థ రజతోత్సవ వేడుకలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, బయ్యవరంలో జరుగుతున్న వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె వచ్చారు. హెరిటేజ్ ఫుడ్స్ కు బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె పలు రైతు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు.