: గోమాంసం తినే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది: కేంద్ర మంత్రి
గోరక్షణ పేరుతో హత్యలకు పాల్పడుతున్న వారిపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి రామ్‌దాస్ అథవాలే మండిపడ్డారు. `ప్రతి ఒక్కరికీ గోమాంసం తినే హక్కు ఉంది. గోరక్షణ పేరుతో మానవ భక్షణ చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి` అని అథవాలే మీడియాతో అన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు గోరక్షకులకు లేదని, వారికి ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు చెప్పాలి గానీ, ఇలా హత్యలు చేయవద్దని ఆయన హితవు పలికారు. మాంసం కోసం గోవుల క్రయవిక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది కార్యకర్తలు గోరక్షకులుగా మారి హత్యలు చేస్తున్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని ప్రతిపక్షాలు అధికార పక్షంపై దుమ్మెత్తి పోస్తున్న సంగతి తెలిసిందే!