: మలయాళ నటి లైంగిక వేధింపుల కేసులో పలు వ్యాఖ్యలు చేసిన కమలహాసన్‌కి నోటీసులు


మలయాళ సినీనటిపై లైంగిక వేధింపుల కేసు గురించి సినీన‌టుడు క‌మ‌ల‌హాస‌న్ మీడియాతో మాట్లాడుతూ ప‌లు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసులోని బాధితురాలి పేరును క‌మ‌లహాస‌న్ వెల్లడించార‌ని జాతీయ మహిళా కమిషన్ మండిప‌డింది. ఇటువంటి కేసులో బాధితురాలి పేరుని బహిర్గతం చేసి ఆయ‌న నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించార‌ని పేర్కొంటూ స‌ద‌రు న‌టుడికి నోటీసులు జారీ చేసింది. ఇటీవల మీడియాతో మాట్లాడే క్రమంలో విలేక‌రులు కమలహాసన్‌కి ఓ సూచ‌న కూడా చేశారు.

బాధితురాలి పేర్లని బహిర్గతం చేయకూడదు కదా? అని విలేకరులు అడిగారు. అయిన‌ప్ప‌టికీ క‌మ‌ల్ హాస‌న్ ఇందులో త‌ప్పేమీలేద‌ని వ్యాఖ్యానించారు. అంతేగాక‌, బాధితురాలిని ద్రౌపది అని పిల్చుకోవాలని అనిపిస్తే, అలాగే పిల్చుకోండంటూ ఉచిత స‌ల‌హా ఇచ్చారు. అంతేగానీ ఓ మహిళ అంటూ వార్త‌లు ఇవ్వ‌బోకండంటూ మాట్లాడారు.  

  • Loading...

More Telugu News