: అకున్ సబర్వాల్ సెలవుపై వెళుతుండటానికి కారణమిదే!


టాలీవుడ్ డ్రగ్ కల్చర్ పై ఉక్కుపాదం మోపిన ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఈ నెల 16 నుంచి 27వ తేదీ వరకు సెలవుపై వెళుతున్నారు. సీనీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన క్రమంలో, వారిని విచారించే సమయంలో ఆయన సెలవుపై వెళుతుండటం పట్ల పలు సందేహాలు తలెత్తాయి. తీవ్రమైన ఒత్తిడి వస్తున్న నేపథ్యంలోనే ఆయన సెలవుపై వెళుతున్నారనే ఆరోపణలు కూడా వినిపించాయి.

ఈ నేపథ్యంలో అకున్ సబర్వాల్ తన సెలవుపై క్లారిటీ ఇచ్చారు. తాను పర్వతారోహణకు లద్దాఖ్ వెళుతున్నానని ఆయన చెప్పారు. డ్రగ్స్ కేసు రిజిస్టర్ కాకముందే లీవ్ కు అప్లై చేసినట్టు తెలిపారు. తన సెలవుకు, డ్రగ్స్ కేసుకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను తీసుకుంటున్న సెలవు వ్యక్తిగతమైనదని... కేసుపై ఇది ఎలాంటి ప్రభావం చూపబోదని అన్నారు. 

  • Loading...

More Telugu News