: ప్రతి ఇంటికీ నెలకు 10 వేల ఆదాయం కల్పించడమే లక్ష్యం: నారా లోకేష్
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నెలకు రూ. 10 వేల ఆదాయం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాయలసీమను ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా చేయడమే ముఖ్యమంత్రి సంకల్పమని అన్నారు. కర్నూలు పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సురక్షిత తాగునీటి కోసం రూ. 15 వేల కోట్లను ఖర్చు చేస్తున్నామని చెప్పారు. సర్పంచులు పంచాయతీ నిధులను ఖర్చు చేసి అభివృద్ధి పనులను చేపట్టాలని... లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిమెంట్ రోడ్లు వేసిన తర్వాత మొక్కలను నాటాలని... లేకపోతే బిల్లులను మంజూరు చేయమని చెప్పారు. మూడు నెలల్లో కర్నూలు జిల్లాలో నాలుగైదు ప్రముఖ కంపెనీలను ఏర్పాటు చేస్తామని అన్నారు.