: సంగక్కర కొట్టిన షాట్ కు ఓ అభిమాని ఫోన్ ఎలా పగిలిపోయిందో చూడండి!
శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఇంగ్లండ్ డొమెస్టిక్ టీ20 టోర్నీలో పాల్గొంటున్నాడు. తాజాగా సర్రే-మిడిల్ సిక్స్ జట్ల మధ్య ఓ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో సంగక్కర విశ్వరూపం చూపించాడు. 6 ఫోర్లు, 3 సిక్సులతో 70 పరుగులు చేసి, ఇంకా తనలో వేడి తగ్గలేదని నిరూపించుకున్నాడు.
కాగా, ఆయన ఓ సిక్స్‌ను బాదిన సమయంలో ఆ బంతి తాకి ఓ అభిమాని ఫోన్ పగిలిపోయింది. స్టీవెన్ ఫిన్ బౌలింగ్‌లో సంగక్కర భారీ షాట్ కొట్టగా ఆ బాల్‌ను అందుకోవాలని చూశాడు ఓ అభిమాని. అయితే అతడి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండడంతో బాల్ తగిలి అది పగిలిపోయింది. తన ఫోన్‌ను కెమెరాకు చూపిస్తూ ఆ అభిమాని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.