: 73 శాతం మంది భారతీయులకు మోదీపై నమ్మకం ఉంది: తాజా అధ్యయనం
ప్రధాని నరేంద్రమోదీ పాలనపై భారతీయులకు ఉన్న నమ్మకమే ఆయనను మొదటి స్థానంలో నిలబెట్టింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) చేసిన అధ్యయనంలో 73 శాతం మంది భారతీయులు మోదీ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారని తేలింది. 63 శాతం కెనడియన్ల నమ్మకంతో ఆ దేశ ప్రధాని జస్టిన్ త్రెదో రెండో స్థానంలో ఉన్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కేవలం 30 శాతం మంది అమెరికన్లే నమ్ముతున్నట్లు అధ్యయనం తేల్చి చెప్పింది. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ఆర్థిక రంగ సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారన్న విమర్శలు వచ్చినా, ఇప్పటికీ ఎక్కువ మంది భారతీయులు మోదీ పాలనను నమ్ముతున్నారని ఈ అధ్యయనం ద్వారా స్పష్టత వచ్చింది.