: జగన్ కు, చంద్రబాబుకు, నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది: మంత్రి ప్రత్తిపాటి
వైసీపీ అధినేత జగన్ కు డబ్బు మీద ఉన్నంత ప్రేమ... ప్రజలపై లేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. రాజధాని నిర్మాణం, ప్రజలు, రైతుల కష్టాలు జగన్ కు పట్టవని అన్నారు. అవినీతిపరుడైన జగన్ కు, ప్రజారంజకంగా పాలిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు నక్కకు- నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నాడని... అది పగటి కలగానే మిగిలిపోతుందని అన్నారు. జగన్ ఎన్నటికీ సీఎం కాలేరని చెప్పారు.