: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన కలెక్టర్ ప్రీతిమీనా
మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనాతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ అవమానకర రీతిలో ప్రవర్తించడంపై ఐఏఎస్ ల సంఘం మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బీపీ ఆచార్య ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ను ప్రీతిమీనా ఈ రోజు కలిశారు. ఎమ్మెల్యే తనతో వ్యవహరించిన తీరును సీఎస్ కు వివరించారు. కాగా, ఈ ఘటనపై కలెక్టర్ కు ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్షమాపణలు చెప్పినప్పటికీ, కలెక్టర్ అంగీకరించని విషయం తెలిసిందే.