: అకున్ సబర్వాల్ ను తప్పించేందుకు ప్రయత్నాలు: రేవంత్ రెడ్డి
డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులను విచారించాల్సిన ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ను ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా తప్పించే ప్రయత్నం చేస్తోందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంలోని పెద్దలకు సన్నిహితులైన కొందరు సినీ ప్రముఖులను ఈ కేసు నుంచి తప్పించేందుకు ఆయనను సెలవుపై పంపిస్తున్నారని విమర్శించారు. విచారణ ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఆయన సెలవుపై వెళుతుండటం వెనుక ఒత్తిళ్లే కారణమని చెప్పారు. 10 రోజుల పాటు అకున్ సబర్వాల్ సెలవుపై వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే, తమపై ఎలాంటి ఒత్తిడి లేదని... ప్రభుత్వం నుంచి తమకు పూర్తి సహాయసహకారాలు ఉన్నాయని అకున్ చెప్పారు.