: దేశం వదిలి వెళ్లాలని కోరుకునే వారిలో భారతీయులకు రెండో స్థానం
స్వదేశం వదిలి విదేశాల్లో స్థిరపడాలని కోరుకునే వారిలో భారతీయులు రెండో స్థానంలో ఉన్నట్లు ఓ రిపోర్టులో తేలింది. ఐక్యరాజ్యసమితి వారి అంతర్జాతీయ వలస సంస్థ రూపొందించిన `గ్లోబల్ మైగ్రేషన్ పొటెన్షియల్ 2010-2015` రిపోర్టులో, వచ్చే 12 నెలల్లో తమ దేశాన్ని వదిలి వేరే దేశానికి వలస వెళ్లాలనుకుంటున్న వారు 66 మిలియన్ల మంది ఉన్నారని తేలింది. ఈ ప్రకారంగా చూస్తే నైజీరియన్ల తర్వాత స్థానంలో ఉన్నది భారతీయులే. ముఖ్యంగా వీరంతా అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, దక్షిణాఫ్రికా దేశాల్లో స్థిరపడాలనుకుంటున్నారు. ఇక భారతీయుల తర్వాతి స్థానాల్లో కాంగో, సూడాన్, బంగ్లాదేశ్, చైనా దేశీయులు ఉన్నారు. మన దేశంలో 4.8 మిలియన్ల మంది దేశం వదిలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రతి ముగ్గురిలో ఒక్కరికి ఇండియా వదిలి వెళ్లాలనుందన్నమాట!