: అసెంబ్లీలో పేలుడు ప‌దార్థం ల‌భించిన ఘటనపై సీఎం యోగి ఆగ్రహం


ఉత్త‌ర ప్ర‌దేశ్ అసెంబ్లీలో స‌మావేశాలు జ‌రుగుతుండ‌గా ఓ ఎమ్మెల్యే కుర్చీ కింద శక్తిమంత‌మైన పేలుడు ప‌దార్థం ల‌భించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్య‌నాథ్ సీరియ‌స్ అయ్యారు. ఈ ఘ‌ట‌న‌పై ఆయ‌న అసెంబ్లీలో మాట్లాడుతూ... దీనిపై విచారణ జరపాలని ఎన్ఐఏను కోరతామ‌ని తెలిపారు. ఇది కచ్చితంగా ఉగ్రదాడి కోసం చేసిన ప్రయత్నమే అని ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు. ఇందుకు కార‌ణ‌మైన‌ నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామ‌ని చెప్పారు. శాస‌న‌స‌భ్యులు ఇకపై శాస‌న‌స‌భ‌లోకి సెల్‌ఫోన్లు తీసుకురావ‌ద్ద‌ని ఆయ‌న సూచించారు. ఒకవేళ తీసుకొస్తే వాటిని సైలెంట్ మోడ్‌లో పెట్టుకోవాల‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News