: రెజ్లింగ్ బెల్ట్ సాధించిన క్రికెటర్... మాట నిలుపుకున్న రెజ్లర్!
రైజింగ్ పూణె సూపర్‌జైంట్స్‌ను ఓడించి ఐపీఎల్ 2017 కప్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రత్యేకంగా తయారుచేసిన ఒక రెజ్లింగ్ బెల్ట్‌ను పంపిస్తానని డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, సీఓఓ ట్రిపుల్ హెచ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే! ఇప్పుడు ఆ మాటను ఆయన నిలుపుకున్నారు. ముంబై ఇండియన్స్ లేబుల్‌తో ఉన్న రెజ్లింగ్ బెల్ట్‌ను రోహిత్ శర్మకు ట్రిపుల్ హెచ్ పంపించారు. ఆ బెల్ట్ చూసి రోహిత్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. `ఇది నేను నమ్మలేకపోతున్నా. ఒక ఛాంపియన్ నాకోసం ఛాంపియన్ బెల్ట్‌ను పంపించారా? థ్యాంక్యూ ట్రిపుల్ హెచ్` అంటూ ట్వీట్ చేశాడు.