: మన వాళ్లు ఒట్టి బద్ధకస్తులోయ్...నాలుగడుగులు కూడా వేయలేరు!: తాజా అధ్యయనం


స్మార్ట్ ఫోన్స్ యాప్‌ బిల్టిన్ యాక్సెలెరో మీటర్ ఆధారంగా చేసిన స‌ర్వే ద్వారా భారతీయులు బద్ధకస్తులేనని స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ ప‌రిశోధ‌కులు తేల్చేశారు. ప్ర‌పంచంలోని ప‌లు దేశాల్లో ప‌రిశోధ‌కులు ఈ స‌రికొత్త‌ స‌ర్వే నిర్వ‌హించారు. అధిక దూరం న‌డ‌వాలంటే భార‌తీయులు మరింత బ‌ద్ధ‌కంగా వ్యవహరిస్తారని తెలిపారు. స్మార్ట్ ఫోన్స్ లో బిల్టిన్ యాక్సెలెరో మీటర్ ఇన్ స్టాల్ చేసుకుంటే ఆ యూజ‌ర్‌ ఎంత దూరం నడుస్తున్నాడనే విషయాన్ని అది ట్రాక్ చేస్తుంది. ప్ర‌పంచంలోని 111 దేశాల యూజ‌ర్ల‌కు సంబంధించిన డేటాతో ఈ అధ్యయనాన్ని చేప‌ట్టారు. దీని ద్వారా మొత్తం 7.17 లక్షల మంది వ్యక్తులు ఎంతగా న‌డుస్తున్నార‌న్న విష‌యం తెలిసింది.

దీని ప్ర‌కారం భారతీయులు సగటున రోజుకు 4,500 అడుగులు వేస్తున్నారని ప‌రిశోధ‌కులు తేల్చారు. వీరు సేక‌రించిన‌ మొత్తం డేటా ప్రకారం మానవులు సగటున రోజుకు 4,961 అడుగులు వేస్తున్నారు. భార‌తీయులు మాత్రం 4,500 అడుగులు మాత్ర‌మే వేస్తున్నార‌ని తేలింది. ఇక ఇండోనేషియ‌న్లు రోజుకు 3513 అడుగులు మాత్రమే న‌డుస్తున్నార‌ని తెలిసింది. దీంతో ప్ర‌పంచంలోనే అధిక శాతం మంది బ‌ద్ధ‌క‌స్తులున్న దేశం ఇండోనేషియ‌న్లని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. ఇక అత్య‌ధిక దూరం నడుస్తూ బ‌ద్ధ‌కం లేద‌నిపించుకున్న దేశంలో హాంకాంగ్ అగ్ర‌స్థానంలో ఉంది. ఆ దేశంలోని వారు సగటున 6,880 అడుగులు వేస్తున్నార‌ని తేలింది. హాంకాంగ్ త‌రువాతి స్థానంలో వ‌రుస‌గా చైనా, ఉక్రెయిన్, జపాన్, రష్యా దేశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News