: ఎంతో మంది నటులు బానిసలవుతున్నారు.. బాధ కలుగుతోంది: నటుడు రాజేంద్రప్రసాద్
డ్రగ్స్ కేసులో పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు అందడంపై సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి రోల్ మోడల్స్ గా ఉండాల్సిన సినీ నటులు డ్రగ్స్ కు బానిసలవడం బాధాకరమని అన్నారు. ఎక్సైజ్ శాఖ పలువురికి నోటీసులు పంపడం బాధను కలిగించిందని చెప్పారు. సినీ పరిశ్రమలో గుర్తింపు లభించకపోవడంతో, మనస్తాపానికి గురై చాలా మంది నటులు మత్తుమందులకు బానిసలవుతున్నారని అన్నారు. పట్టుదలతో కృషి చేసి, ప్రేక్షకులను నవ్విస్తూ, నవ్వుతూ బతకడం కంటే గొప్ప కిక్కు మరేదీ ఉండదని చెప్పారు.