: ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్


మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనాతో అమర్యాదకరంగా ప్రవర్తించి, తీవ్ర విమర్శలపాలైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు సీఎం కేసీఆర్ ఝలక్కిచ్చారు. ఈ ఉదయం కేసీఆర్ ను కలిసి వివరణ ఇచ్చేందుకు మెదక్ జిల్లాలోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు శంకర్ నాయక్ వెళ్లారు. తాను వచ్చినట్టు అధికారుల ద్వారా సమాచారాన్ని పంపారు. శంకర్ నాయక్ ను కలిసేందుకు కేసీఆర్ నిరాకరించడంతో, అదే విషయాన్ని అధికారులు ఆయనకు చేరవేశారు. దీంతో చేసేదేమీ లేక శంకర్ నాయక్ అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News